సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన నమ్రత

by sudharani |
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన నమ్రత
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త సినిమాను ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా హీరోగా ప్రొడక్షన్ నెం.27 చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ తాజాగా.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో అశోక్ గల్లాతో పాటు 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, 'కోట బొమ్మాళి పి.ఎస్' ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.

Next Story

Most Viewed