- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలియా భట్‌కు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్.. ఈ రోగం ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి?

దిశ, ఫీచర్స్ : పెళ్లికి ఎక్కువ మేకప్ వేసుకోక పోవడానికి కారణం ఏంటి? అని అలియా భట్ ను అడిగాడు యాంకర్. తనకు అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉందని... తాను ఎక్కువ సేపు ఒకే విషయంపై కాన్సంట్రేట్ చేయలేనని, అందుకే అలా జరిగిందని చెప్పింది బ్యూటీ. 40 నిమిషాల కన్నా ఎక్కువ సమయం కూర్చోలేనని ముందే మేకప్ మ్యాన్ కు చెప్పానని.. అందుకు అనుగుణంగానే రెడీ చేశారని తెలిపింది. దీంతో అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ అంటే ఏమిటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అని కూడా పిలుస్తారు. ఇది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. కాగా ఇందుకు సంబంధించిన ఫుల్ డిటైల్స్ తెలుసుకుందాం.
లక్షణాలు:
1. అజాగ్రత్త:
- దృష్టిని కేంద్రీకరించడంలో ఇబ్బంది
- సులభంగా పరధ్యానం
- మతిమరుపు
- అస్తవ్యస్తత, గందరగోళం
2. హైపర్యాక్టివిటీ
- అశాంతి
- కదులుతూనే ఉండటం
- ఆకస్మికత
3. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ లోపాలు
- ప్రణాళిక ప్రకారం నడుచుకోవడంలో సవాళ్లు
- టీమ్ మేనేజ్‌మెంట్ ఇబ్బందులు
- సెల్ఫ్ కంట్రోలింగ్ చేసుకునేందుకు పోరాటం
కారణాలు, ప్రమాద కారకాలు
1. జన్యుపరమైన అంశాలు
2. మెదడు నిర్మాణం, పనితీరులో తేడాలు
3. పర్యావరణ కారకాలు (ఉదా., పొగాకు పొగకు ప్రినేటల్ ఎక్స్పోజర్)
4. నెలలు నిండకుండా పుట్టడం లేదా తక్కువ బరువుతో పుట్టడం
వ్యాధి నిర్ధారణ, చికిత్స
సమగ్ర వైద్య మూల్యాంకనం, మానసిక అంచనాలు, ప్రవర్తనను పరిశీలించడం ద్వారా వ్యాధి నిర్ధారణ సాధ్యమే. కాగా చికిత్స కోసం మందులు (స్టిమ్యులెంట్స్, నాన్-స్టిమ్యులెంట్స్), బిహేవియరల్ థెరపీ అవసరం. అయితే జీవనశైలి మార్పులు ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సహాయం చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. రెగ్యులర్ వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి నిర్వహణ ద్వారా కాన్సంట్రేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పనులను చిన్న చిన్న విభాగాలుగా విభజించాలని.. రిమైండర్‌లు, క్యాలెండర్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు.