- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హెచ్ఎండీఏ అధికారులతో హైడ్రా కమిషనర్ సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో : చెరువుల పరిరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పచ్చదనం వంటి అంశాలపై హెచ్ఎండీఏ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం సమావేశమయ్యారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల వాస్తవ పరిధి, సరిహద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి, ప్రస్తుత పరిస్థితి గురించి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని హెచ్ఎండీఏ అధికారులకు రంగనాథ్ సూచించినట్టు తెలిసింది. ఈ చెరువులపై సర్వే చేసే బాధ్యతలను ఎన్సీపీఈ కన్సల్టెన్సీకి అప్పగించారని సమాచారం. ఈ సమావేశానికి కన్సల్టెన్సీ ప్రతినిధులు కూడా హాజరయ్యారని తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని కోరినట్టు అధికారులు చెబుతున్నారు.
బేగంపేట్ లో రంగనాథ్ తనిఖీ :
భారీవర్షం నేపథ్యంలో బేగంపేట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం తనిఖీ చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండ వాటర్ లాగింగ్ పాయింట్లను క్లియర్ చేయాలని డీఆర్ఎఫ్ టీములను రంగనాథ్ ఆదేశించారు. వర్షపు నీరంతా డ్రెయినేజీలోకి వెళ్లడంలేదని, డ్రెయినేజీలోంచి నీరంతా బయటికి వస్తోందని రంగనాథ్ తెలిపారు. వర్షపు నీరంతా హుస్సేన్ సాగర్ లోకి వెళ్లాల్సిన చోట ఈ సమస్య ఉందన్నారు.