వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

by Aamani |
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
X

దిశ,కూకట్​పల్లి : అల్లాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధి గాయత్రి నగర్​ కాలనీలోని ఓ ప్లాట్​లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అల్లాపూర్​ సీఐ వెంకట్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అల్లాపూర్​ గాయత్రి నగర్​లో ఓ ప్లాట్​ను అద్దెకు తీసుకుని ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ప్లాట్​పై దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న వంశీకృష్ణ(29),ఓ మహిళ, విటుడు మహంకాళి సాయి కిరణ్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్​ ఫోన్​లను, రూ.6280 నగదు, ఒక ల్యాప్​టాప్​ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకట్​రెడ్డి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story