Charles Dolan: హోమ్ బాక్స్ ఆఫీస్ ఫౌండర్ చార్లెస్ డోలన్ కన్నుమూత

by Maddikunta Saikiran |
Charles Dolan: హోమ్ బాక్స్ ఆఫీస్ ఫౌండర్ చార్లెస్ డోలన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త, హోమ్ బాక్స్ ఆఫీస్(HBO) టెలివిజన్ ఛానెల్ ఫౌండర్ చార్లెస్ డోలన్(Charles Dolan) తుది శ్వాస విడిచారు. 98 సంవత్సరాల వయస్సులో సహజ కారణాలతో(Natural Causes) మరణించారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో అధికారికంగా తెలిపింది. కాగా డోలన్ HBO ఛానెల్(Channel)ను 1972లో స్థాపించారు. ఆ తర్వాత 1973లో దేశంలోని అతిపెద్ద కేబుల్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఒకటైన కేబుల్‌విజన్‌(Cablevision)ని సృష్టించారు. అలాగే 1986లో న్యూయార్క్(New York) నగరంలో న్యూస్ 12(News 12)ను ప్రారంభించాడు. యూఎస్(US)లో ఇది మొదటి 24 గంటల లోకల్ కేబుల్ న్యూస్ ఛానెల్. కాగా చార్లెస్ డోలన్ భార్య(Wife) కూడా కొన్ని నెలల క్రితమే మరణించారు. వీరికి మొత్తం ఏడుగురు సంతానం ఉన్నారు. వీరిలో ఒకరైన పాట్రిక్ డోలన్(Patrick Dolan) ప్రస్తుతం HBO కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Advertisement

Next Story