- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Education: ఇవన్నీ చూస్తుంటే భయమేస్తోంది.. ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో పరిస్థితులు చూస్తుంటే నిజంగా భయమేస్తుందని విద్యా కమిషన్ చైర్మన్(Education commission Chairman) ఆకునూరి మురళి(Akunuri Murali) అన్నారు. దేశాన్ని చూస్తుంటే భయమేస్తోందన్న ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీత అమర్థ్యసేన్(Amarthya Sen) వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మతం పేరుతో సామాన్యప్రజలను (బాగా చదువుకున్న వాళ్ళను కూడా)మభ్యపెట్టి, రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి ధనవంతులను అందలం ఎక్కించి పేదోళ్లను మధ్య తరగతి ప్రజలను పట్టించుకోకపోడం(నాణ్యమైన విద్య, వైద్యం, జీవనోపాదులు ఇవ్వకపోడం) లాంటివి చేస్తున్నారని అన్నారు. అలాగే దేశంలో రాజకీయనాయకుల అబద్దాలు, పిచ్చి పరిపాలన, లంచగొండితనం, డబ్బును విదేశాలలో దాచుకోడం, ఎదుటి రాజకీయ పార్టీలను చంపి తామే ఉండాలనుకోడం, ప్రజలలో పిచ్చి స్వార్ధం, కులతత్వం, మూఢ నమ్మకాలు, క్రమశిక్షణ క్షీణించడం లాంటివి అన్నీ చూస్తుంటే నిజంగా భయమేస్తుందని ఆకునూరి రాసుకొచ్చారు.