- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mumbai Court : ఎనిమిది మంది పాకిస్తానీలకు 20 ఏళ్ల జైలు శిక్ష
దిశ, నేషనల్ బ్యూరో : రూ.7 కోట్లు విలువైన డ్రగ్స్‌తో దొరికిపోయిన ఎనిమిది మంది పాకిస్తానీల(Pakistani men)కు 20 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు(Mumbai Court) తీర్పును వెలువరించింది. వారిపై చెరో రూ.2 లక్షల జరిమానాను కూడా విధించింది. డ్రగ్స్ నిరోధక చట్టం కింద ఆ ఎనిమిది మందిపై దక్షిణ ముంబై పోలీసులు నమోదు చేసిన అభియోగాలు నిరూపితం కావడంతో కోర్టు ఈమేరకు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే.. 2015లో హెరాయిన్(heroin)ను తరలిస్తున్న ఒక బోటును గుజరాత్ తీరంలో భారత కోస్ట్‌గార్డు అధికారులు పట్టుకున్నారు. అందులో 11 డ్రమ్ములు, 20 ప్లాస్టిక్ ప్యాకెట్లను గుర్తించారు. వాటిలో ఉన్నదంతా హెరాయిన్ అని వెల్లడైంది.
బోటులో 200 కిలోల డ్రగ్స్ ఉన్నాయని.. వాటి విలువ దాదాపు రూ.7 కోట్ల దాకా ఉంటుందని తేలింది. ఆ బోటులో ఉన్న 8 మంది పాకిస్తానీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు శాటిలైట్ ఫోన్లు, జీపీఎస్ నావిగేషన్ ఛార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను దక్షిణ ముంబై పోలీసులకు అప్పగించారు. దేశంలోకి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేవారికి తీవ్ర హెచ్చరిక చేసేలా తీర్పు ఉండాలని కోర్టును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేశ్ పుంజ్వానీ కోరారు.