Dense Fog : ఉత్తరభారతాన్ని కమ్మేసిన పొగమంచు.. 255 విమానాలు ఆలస్యం

by Sathputhe Rajesh |
Dense Fog : ఉత్తరభారతాన్ని కమ్మేసిన పొగమంచు.. 255 విమానాలు ఆలస్యం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఢిల్లీలో 250 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 విమానాలు రద్దు అయ్యాయి. 15 విమానాలను దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్ పోర్ట్‌లో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ షెడ్యూల్‌లో మార్పుల వివరాల కోసం ఎయిర్ లైన్స్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సైతం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. పొగమంచు కారణంగా పలు రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో 24 రైళ్లు ఆలస్యం నడుస్తున్నాయి. వాహనదారులు సైతం రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, నొయిడా, లక్నో, గురుగ్రామ్, ఆగ్రా, కర్నాల్, ఘజియాబాద్, అమృత్‌సర్, జైపూర్‌తో పాటు పొగమంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఢిల్లీలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లో సైతం పొగమంచు కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తర భారతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed