వాహ్ భలే ఉంది రా చాయ్.. పొంగులేటి

by Sumithra |   ( Updated:2025-01-04 05:03:37.0  )
వాహ్ భలే ఉంది రా చాయ్.. పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్ : ఏరా చెల్లమ్మ.. నీదేనా రా షాప్.. ఏం రెడీ చేసావ్.. టీ చేశావా.. ఇవ్వు.. వాహ్ భలే ఉంది రా చాయ్ అంటూ ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో టీ స్టాల్ ఏర్పాటు చేసిన మహిళను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఆ టీ స్టాల్ ను శనివారం మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డితో కలిసి ప్రారంభించారు.

మహిళలు స్వశక్తితో ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్ది మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ్ బాబు, కొప్పుల చంద్రశేఖర్, కళ్లెం వెంకట రెడ్డి, వెంపటి రవి, భూక్య సురేష్ నాయక్, రమేష్, చీకటి శ్రీను, యాలాద్రి, మెండె వెంకటేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null