- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pocso Act: పోక్సో చట్టం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్ డెస్క్: పోక్సో చట్టం(Pocso Act) కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు(Fast Track court) సంచలన తీర్పు(Judgement) వెలువరించింది. లైంగిక దాడి నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష(Rigorous Imprisonment) విధించింది. 2018లో వనస్థలిపురం పోలీస్ స్టేషన్(Vanasthalipuram Police Station) పరిధిలో తాపీ మేస్త్రి పనిచేసే ఓ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై రంగారెడ్డి జిల్లా, ఎల్.బి.నగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి విచారణ జరిపి, నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15,000/- జరిమానా విధించారు. అంతేగాక బాధితురాలికి రూ.3,00,000/- పరిహారం అందించాలని ఆదేశించారు.