అప్లికేషన్ ఫెయిల్.. ఆందోళనలో నిరుద్యోగులు

by Aamani |
అప్లికేషన్ ఫెయిల్.. ఆందోళనలో నిరుద్యోగులు
X

దిశ, రాజాపేట : రాజీవ్ యువ వికాస్ పథకం అప్లికేషన్ సర్వర్ డౌన్ తో సబ్మిట్ కాకుండా ఫెయిల్ అవుతుంది. 14వ తేదీ ఆఖరి రోజు కావడం రెండో శనివారం, ఆదివారం, సోమవారం సెలవు దినం కావడంతో దరఖాస్తుదారులు మీ సేవ, ఆన్లైన్ సెంటర్ల వద్దకు భారీగా రావడంతో సర్వర్ మొరాయిస్తుందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం వరకు యాదాద్రి జిల్లాలో 25,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ఫారానికి ఇతర పత్రాలు జత చేసి స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయాలలో గడువు లోపల కచ్చితంగా సమర్పించాలని అధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు.

ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్ మొరాయించి ఫెయిల్ అవుతుండడంతో ఆ తర్వాత సెలవు దినాలు కావడంతో దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో అయోమయంలో దరఖాస్తుదారులు ఉన్నారు. సెలవు దినాలలో కార్యాలయాలు తెరిచి ఉంచుతారా? లేదంటే తేదీని పొడిగిస్తారా? 15వ తేదీన తీసుకుంటారా? వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కార్యాలయాలలో మాన్యువల్ దరఖాస్తులు తీసుకోవాలని పై అధికారుల సూచనలు ఉన్నప్పటికీ ఎంపీడీవో కార్యాలయాల లోని ప్రజా సేవ కేంద్రాలలో తీసుకోవడం లేదు. ఆన్లైన్ దరఖాస్తు చేసిన వారు మాత్రమే అన్ని పత్రాలతో కూడిన వాటిని అందిస్తే మాత్రమే తీసుకుంటున్నారు. సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.



Next Story

Most Viewed