- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ట్రోల్స్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. గతేడాది ‘ది గోట్’(The Goat)లో మెరిసిన ఈ బ్యూటీ.. ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam ) చిత్రంతో తన గ్రాఫ్ మరింత పెంచుకునే పనిలో ఉంది మీనాక్షి. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh)హీరోగా.. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషనల్ భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి.. తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టతరమైన విషయాన్ని ఒకటి షేర్ చేసుకుంది. ‘విజయ్(Vijay)తో కలిసి నటించిన ది గోట్ సినిమా రిలీజ్ అయ్యాక నా నటనపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్ కారణంగా వారం రోజులు నేను డిప్రెషన్‌లోకి వెళ్లి పోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ మీనాక్షి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)తో కూడా ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) సినిమా చేయబోతుంది. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే.