- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGRSA నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రెవెన్యూ శాఖ ప్రధాన కార్యాలయం సీసీఎల్ఏలో పాగా వేసింది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో భాగంగా టీజీఆర్ఎస్ఏ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం సీసీఎల్ఏ యూనిట్ టీజీఆర్ఎస్ఏ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఆర్ఎస్ఏ గౌరవ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం సమక్షంలో నూతన కమిటీని ఎన్నకున్నారు.
అధ్యక్షుడిగా ఆర్.రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కె.శ్రీనివాసులు, కె.రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా ఏ వెంకటేశ్వర్లు, గులాం ఫరూఖ్ అలీ, ఎం.వెంకటేశం, ఎం.స్వాతి, ప్రధాన కార్యదర్శిగా డీవీఎస్ఎస్ కృష్ణ చైతన్య, కోశాధికారిగా ఎం.పల్లవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్వీ సుమిత్ర, డి.సందీప్, స్పోర్ట్స్ సెక్రటరీగా యశ్వంత్, కల్చరల్ సెక్రటరీగా విద్యా దీప్తి, జాయింట్ సెక్రటరీలుగా ఆర్.సురేష్, కె.వినయ్‌కుమార్, వినీత, ఎండీ నబి, ఎస్.రమేష్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా బి.ఉమామహేశ్వర్, సీహెచ్.ఉషారాణి, ఎండీ ఇక్రముద్ధీన్, డి.సాయినాథ్, అక్బర్ తాబ్‌రెజ్, దివ్య, ఎండీ అహ్మద్ షరీఫ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కమిటీలోనూ సీసీఎల్ఏకు సముచిత స్థానాన్ని కల్పించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డి.శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా కె.మంజుల, కార్యదర్శులుగా ఎం.సంతోష్‌లాల్, ఎం.సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీగా పి.సురేష్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీర్ ముర్తూజ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.