- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జబర్దస్త్ ఫైమా పెళ్లి ఫిక్స్.. నిజంగా లవ్ చేశానంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న కమెడీయన్ ప్రవీణ్!
దిశ, సినిమా: బుల్లితెర కామెడీ షో జబర్దస్త్(Jabardast) ద్వారా ఎంతోమంది నటీనటులు ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలామంది కమెడియన్స్ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఇందులో పటాస్ షో నుంచి వచ్చిన ఫైమా(Faima), ప్రవీణ్(Praveen) కూడా ఉన్నారు. వీరిద్దరు గతంలో ఎన్నో స్కిట్స్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సన్నిహితంగా ఉంటూ ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేయడంతో వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే సడెన్‌గా బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇక ఫైమా మాత్రం తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసి తమ లవ్ ఐదేళ్లు అని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా, వీరిద్దరి ప్రేమ నిజమే అని చెప్పే ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఫైమా, ప్రవీణ్ శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోకు సంబంధించిన ప్రోమో విడుదలవగా.. ఇందులో ప్రవీణ్(Praveen) తన లవ్ స్టోరీని తెలుపుతూ స్టేజ్ మీదనే వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను నా లైఫ్‌లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. కొద్ది రోజుల బాగానే ఉంది. కానీ ఆ తర్వాత నీకు నాకు సెట్ అవ్వను.. నీ లైఫ్ నువ్వు చూసుకో.. నా లైఫ్ చూసుకుంటున్నానని.. నన్ను వదిలేసి వెళ్లిపోయింది’’ అని చెప్పాడు.
వెంటనే ఫైమా ‘‘నువ్వు మాట్లాడింది నాకు కనీసం అర్థం కావడం లేదు. నువ్వు నన్ను నెగిటివ్ చేయాలనే అలా మాట్లాడుతున్నావ్ ’’ అని అంటుంది. అప్పుడు ప్రవీణ్ నేను నీ గురించి చెప్పలేదు అనడంతో.. ఫైమా నాకు పెళ్లి కుదిరింది అని చెప్పాక కూడా నువ్వు మళ్లీ ఈ టాపిక్ తీసుకొచ్చావు. నెగటివ్ చేస్తున్నావ్. నా జీవితంలో కూడా ఇంకోసారి నీతో మాట్లాడను అనడంతో.. ప్రవీణ్ నీకు నాకు ఏ సంబంధం లేదు. నా గురించి తనను అడగకండి.. తన గురించి నన్ను కూడా ఏమీ అడగకండి అని స్టేజిపై వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతటితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.