- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ అరుదైన వ్యాధులతో బాధపడుతుంటారు. హీరోయిన్ సోనాలి బింద్రే(Sonali Bendre) క్యాన్సర్ బారిన పడి మళ్లీ దాని నుంచి కోలుకోని ప్రస్తుతం సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. అంతే కాకుండా మరో బుల్లి తెర హీరోయిన్ హీనా ఖాన్(Hina Khan) కూడా క్యాన్సర్(Cancer) బారిన పడి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలా ఒకరు ఇద్దరు కాదు చాలా మంది నటీనటులు అరుదైన వ్యాధితో బాధపడుతునే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ షాన్ రోమీ(shaunromy) కూడా జుట్టు కోసం స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకుంటున్న అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘గడిచిన ఏడాది నాకెంతో కష్టంగా గడిచింది.
నా ఆటో ఇమ్యూన్ బాగా తగ్గిపోయింది. దీంతో నేను కొన్ని విషయాలను విడిచిపెట్టి, మరికొన్నింటిని దేవునికి ఇవ్వవలసి వచ్చింది. నా జుట్టు మొత్తం ఊడిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఈ సమస్యకు నా స్నేహితురాలు ఓ సలహా ఇచ్చింది. నిజంగా దేవుడు నా కోసమే ఆమెను నా దగ్గరకు పంపించాడు. ఆమె ఒక నెలలోపు వెంట్రుకలు తిరిగి వస్తాయని చెప్పింది. తాను చెప్పిందే జరిగింది. ప్రతి నెలా, రెండు వారాలకోసారి స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆగస్టు నుంచి ప్రతి నెలా ఇంజక్షన్స్ తీసుకున్నాను.
ఆ సమయంలో నేను వర్కవుట్ చేయడానికి లేదా ఏదైనా కష్టమైన పని చేయడానికి భయపడ్డాను. ఎందుకంటే హెవీ వర్క్ చేస్తున్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చేస్తుండేవి. దీంతో నా బాడీ సహకరించకపోయేది. అయితే ముందు నేను ప్రశాంతంగా ఉండాలనుకుని గోవాకు వెళ్లిపోయాను. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడిప్పుడే దీని నుంచి కోలుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. మీరు త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ ముద్దుగుమ్మ ‘లూసిఫర్’, ‘హృదయం’ వంటి సినిమాల్లో నటించింది.