KTR : అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-04 05:47:53.0  )
KTR : అక్షరం మార్పు కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరం మార్పు(Spent on Changing) కోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? చేస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)మండిపడ్డారు. రైతు భరోసా ఇచ్చింది లేదు..రుణమాఫీ సక్కగా చేసింది లేదు..పెన్షన్ పెంచింది లేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు..కానీ..ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? అంటూ రవాణా శాఖలో టీఎస్ బదులు టీజీ మార్పు అంశంపై చేసిన ఖర్చును కేటీఆర్ తప్పుబట్టారు. వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా..తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవని..నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

కాగా కేటీఆర్ ట్వీట్ పై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. కోటికి..వెయ్యి కోట్లకి తేడా తెలియనంతగా గుంజినవా సైకో రామ్! అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed