AP News: విజయసాయిరెడ్డికి ఈడీ షాక్.. మళ్లీ నోటీసులు

by srinivas |
AP News: విజయసాయిరెడ్డికి ఈడీ షాక్.. మళ్లీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి(Ycp Mp Vijayasaireddy) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎదుట హాజరుకావాలని సూచించింది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్(Kakinada Sea Port Ltd), సెజ్‌ వాటాలను విజయసాయిరెడ్డి బలవంతంగా లాగేసుకున్నారంటూ గతంలో ఈడీకి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదును ఈడీ అధికారులు పరిశీలించారు. విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్‌(Money laundering)కు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు పలు కారణాలతో విచారణకు రాలేమంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed