- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Seshachalam Forest :శేషాచలం అడవుల్లో దారి తప్పిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు..ఒకరు మృతి
దిశ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవు(Seshachalam Forests)ల్లో దారి తప్పిన(lost Their Way) ఆరుగురు బీటెక్ విద్యార్థు(Six B.Tech Students)ల్లో ప్రమాదంలో ఒకరు(One Dies) మరణించారు. మిగతా ఐదుగురిని పోలీసులు రక్షించారు. గుంజనేరు వాటర్ ఫాల్స్ చూసి తిరిగి వస్తుండగా ఆరుగురు విద్యార్థులు దారి తప్పారు. తప్పిపోయిన ఆరుగురిలో సాయి దత్త అనే విద్యార్థి ప్రమాదవశాత్తు అడవిలోని వాగులో పడి మృతి చెందాడు. అడవిలో దారి తప్పి తిరుగుతున్న ఐదుగురు విద్యార్థులను కోడూరు పోలీసులు రక్షించారు.
విద్యార్థులంతా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వీరంతా దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. అడవిలో విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారి జాడ తెలుసుకుని రక్షించేలోగా ఒకరు మృతి చెందడం విషాదాన్ని కల్గించింది.