ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు..

by Sumithra |   ( Updated:2025-01-04 09:56:44.0  )
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో కార్మికులు పరుగులు తీశారు. చాలామంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బయటివారు ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం పై పూర్తి వివరాలు తెలియ రావటం లేదు. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన కార్మికులు కూడా స్థానికులే అన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed