- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR : ఫార్ములా ఈ రేసు కేసులో పస లేదు : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : తనపై నమోదైన ఫార్ములా ఈ రేసు కేసు(Formula E-Race Case)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో చిట్ చాట్ లో మాట్లాడారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని పునరుద్ఘాటించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని..కేసులో పస లేదని(False case) అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిదని వ్యాఖ్యానించారు. కేసు వాదోపవాదాల్లో కోర్టులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. నన్ను ఎలాగోలా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఫార్ములా ఈ రేసు కేసుతో ఆరో విఫల యత్నం చేశాడని కేటీఆర్ ఆరోపించారు. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయమని..ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదని గుర్తు చెప్పుకొచ్చారు.
నాపై కేసు పెడితే.. రేవంత్ పై కూడా కేసు పెట్టాలన్నారు. నన్ను అరెస్టు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? అని విమర్శించారు. ఈనెల 7న ఈడీ విచారణకు నేను హాజరయ్యే విషయమై మా న్యాయనిపుణులు నిర్ణయిస్తారన్నారు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెలుతామన్నారు. ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చన్నారు. ఆర్ఆర్ఆర్ కాంట్రాక్టులలో 12వేల కోట్ల అవినీతి జరుగబోంతుందన్నారు. బడా కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ నాయకులు వేల కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
రైతు భరోసాతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుందని, రైతు భరోసా కొందరికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని, రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకని, బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి లేదని, 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. ఏడాది మొదటి హాఫ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం, తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముందని, పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు.