Ap News: పవన్ కల్యాణ్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

by srinivas |
Ap News: పవన్ కల్యాణ్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తాబేళ్లు(Turtles) అక్రమంగా రవాణా అవుతున్నాయి. కాకినాడ జిల్లా వాకపూడి(Vakapudi) వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లను కూడా అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇలా అరుదైన జాతి తాబేళ్లను కూడా విక్రయించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) అప్రమత్తమైంది. తాబేళ్ల అక్రమ తరలింపుపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. తాబేళ్ల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) దృష్టి సారించారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో సముద్రం(Sea)లో 5 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధించారు. అంతేకాదు తీర ప్రాంతం ఐదు కిలో మీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహించారు. చేపల వేటకు వెళ్తున్న రెండు బోట్లను సీజ్ చేశారు.

Advertisement

Next Story