- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేషన్ బియ్యం మాయం కేసు.. విచారణకు హాజరైన పేర్ని జయసుధ
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) భార్య పేర్ని జయసుధ(Perni Jayasudha)కు పోలీసులు మరోసారి నోటీసులు(Notices) జారీ చేసిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం మాయం కేసు(Ration Rice Theft Case)లో నేడు విచారణకు రావాలని నోటీసులు అందించారు. పేర్ని నాని నివాసంలో ఎవరు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు. ఈ క్రమంలో పేర్ని జయసుధ(Perni Jayasudha) మచిలీపట్నం పోలీస్ స్టేషన్ (Machilipatnam Police station) కు హాజరయ్యారు. జయసుధ తరఫు న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్.పేట సీఐ ఏసుబాబు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌లో పీడీఎస్ బియ్యం మాయమైంది. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధను ఏ1గా, మేనేజర్ మానస తేజ్‌ను ఏ2గా చేర్చారు. ఇప్పటికే మానస్ తేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.