అప్పుడే మర్చిపోతే ఎలా... దిల్ రాజు?: బీఆర్ఎస్ నేతల ఫైర్

by srinivas |
అప్పుడే మర్చిపోతే ఎలా... దిల్ రాజు?: బీఆర్ఎస్ నేతల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju)పై బీఆర్ఎస్(BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు, సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్(Allu Arjun) వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) అలా మాట్లాడారని, వాళ్లతో సెటిల్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడటం లేదన్న కేటీఆర్ (Ktr) వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వాడుకోవద్దని మండిపడ్డారు. దీంతో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను దిల్ రాజు వక్రీకరిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్(BRS leader Errolla Srinivas) ఆరోపించారు. సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి దిల్ నిర్మాత మద్దతు తెలిపారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఎంతగా పెరిగిందో అప్పుడే మర్చిపోయారా అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.

Advertisement

Next Story