ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ రహదారుల పై వాకర్స్ కు అనుమతించాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ రహదారుల పై వాకర్స్ కు అనుమతించాలి.. ఎమ్మెల్యే
X

దిశ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ రహదారులలో ఉదయం వాకర్స్ కు, రన్నర్స్ కు అనుమతి లభించేలా యాజమాన్యంతో మాట్లాడి కృషి చేస్తానని బండారి లక్ష్మా రెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో ఈసీఐఎల్ వాకర్స్ క్లబ్ సభ్యులు కలిసి ఇటీవల ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ సంస్థలు చేపట్టిన నియంత్రణ చర్యల పై విన్నవించుకున్నారు. క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తాము దశాబ్దాలుగా తమ ఆరోగ్య రక్షణ కై సంస్థల సహకారంతో నడకదారిని ఉపయోగించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇటీవల ఆ దారిలో వాకర్స్ ను భద్రతా కారణాలతో అనుమతించకపోవడం పై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమలో చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని మానవీయ కోణంలో కనీసం తమకు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య నడకదారిని ఉపయోగించుకునేందుకు అనుమతించేలా చూడాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

సానుకూలంగా స్పందించిన లక్ష్మారెడ్డి ఈసీఐఎల్ అధికారులతో, ప్రభుత్వ రంగ సంస్థలైన కార్మిక నాయకులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ వాకర్స్ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు కాకుండా ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు వెసులుబాటు కల్పించేలా చర్యలకు ఉపక్రమించాలని వారిని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ వాకర్స్ క్లబ్ సభ్యులు రాజు గౌడ్, ఎంపల్లి క్రాంతి రణదేవ్, కె.రవీందర్, చంద్రమౌళి, సాగర్ రెడ్డి, నవీన్ గౌడ్, అంజి, రవీందర్, మనోజ్, గణేష్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed