Puri Jagannath: బ్లాక్ బస్టర్ చిత్రం చిరుతలో అలీకి నచ్చిమి పాత్ర ఎలా వచ్చింది.. దర్శకుడి కామెంట్స్ వైరల్

by Anjali |
Puri Jagannath: బ్లాక్ బస్టర్ చిత్రం చిరుతలో అలీకి నచ్చిమి పాత్ర ఎలా వచ్చింది.. దర్శకుడి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కమెడియన్ అలీ(Famous comedian Ali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath)దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత మూవీలో అలీ కమెడియన్ గా నచ్చిమి(Nacchimi) పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించన విషయం తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ నటించిన ఈ మూవీలోని అలీ పాత్ర గురించి రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చిరుత మూవీ కథ రాసుకున్నప్పుడు అస్సలు అలీకి ఎలాంటి పాత్ర రాసుకోలేదని చెప్పుకొచ్చారు.

కానీ స్క్రిప్ట్ వర్క్ కోసం బ్యాంకాక్ వెళ్తోన్న టైంలోనే ఎదురైన అనుభవాల కారణంగా ఈ కమెడియన్ కోసం రోల్ సిద్ధం చేసుకున్నట్లు పూరి తెలిపారు. హైదరాబాదు ఎయిర్ పోర్ట్‌కు వెళ్లగానే అక్కడ ఓ సెక్యూరిటీ చెక్ వద్ద సార్ మీరు కొత్త మూవీ కోసం వెళ్తున్నారా అని అడిగారని పేర్కొన్నారు. అలాగే అలీ ఏ రోల్‌లో నటిస్తున్నారని భద్రతా సిబ్బందిలో ఒకతను ప్రశ్నించారు. అస్సలు అలీ ఏ పాత్ర అని అడగ్గా.. అప్పుడు ప్రొడ్యూసర్ అశ్వనీ దత్(Producer Ashwani Dutt) కు కాల్ చేసి.. వెంటనే అలీ డేట్స్ తీసుకోండని చెప్పానని చెప్పుకొచ్చారు. వామ్మో అలీకి సినిమాలో పాత్ర ఇవ్వకపోతే ప్రజలు ఊరుకునేలా లేరే అంటూ చెప్పానని దీంతో వెంటనే అలీ డేట్స్ బుక్ చేశానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed