కేసీఆర్ ఆశీస్సులతో ఆలయం అభివృద్ధి : మాజీ మంత్రి హరీష్ రావు

by Aamani |
కేసీఆర్  ఆశీస్సులతో ఆలయం అభివృద్ధి : మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ,జహీరాబాద్: కేసీఆర్ ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం రేజింతల్‌ లో స్వయంభూ సిద్ధివినాయక 225 వ జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం పాల్గొన్నారు. ఆలయ అర్చక బృందం, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వయంభూ సిద్ధి వినాయక 225 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సిద్ధి వినాయకుడు దినదినము ఆకారం పెంచుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, ఆస్ట్రేలియా నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారన్నారు.

గతంలో కేసీఆర్ ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని , ప్రతి సంవత్సరం సిద్ధి వినాయక జయంతి ఉత్సవాలు గొప్పగా జరగడం సంతోషకరమైన విషయమన్నారు. స్వామివారి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొనడం మరింత సంతోషం, ఆనందాన్ని కలిగించింది. సిద్ధి వినాయకుడి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి విశిష్టత ఉన్న సిద్ధి వినాయకుడిని మరెక్కడా మనం చూసి ఉండము. ప్రతి సంవత్సరం నేను జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాను. నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించడం జరిగిందని అన్నారు. ఆయనతోపాటు బీఆర్ఎస్, నాయకులు ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed