- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Brahmamudi: నిన్ను అనవసరంగా ఎత్తుకున్నానే.. అంటూ కావ్య మీద మండిపడిన రాజ్
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
నంద గోపాల్‌ని పట్టుకోవడానికి రాజ్, కావ్య వెళ్తుంటారు. వాడు దొరికితే వాడికి మాములుగా ఉండదు. అక్కడే ఏం చేస్తానో కూడా తెలియదు రాజ్ అంటాడు. అబ్బో చాలు చాలు ఇంక ఆపండి.. దొరికినప్పుడు ఏం చేయలేదు కానీ , ఇప్పుడు మాత్రం ఎదో చేస్తారని బిల్డప్ కొడుతున్నారు అంటూ కావ్య సెటైర్లు వేస్తుంది.
అమ్మా కావ్య నువ్వు ఈ మధ్య నువ్వు టూమచ్‌గా మాట్లాడుతున్నావ్.. అదే కాదు పొగరు కూడా బాగా పెరిగిపోయింది.. రేపటి నుంచి నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని రాజ్ అంటాడు. అవును.. అయితే చిట్‌ఫండ్ దివాళా గురించి ఇంట్లోవాళ్లకి చెప్పేసి.. నా పొగరు మొత్తాన్ని తగ్గించండి.. నేను ఆఫీసుకి రానంటూ కావ్య బాగా రెచ్చగొడుతుంది. అబ్బా ఆపవే బాబు .. నిన్ను అనవసరంగా ఆఫీసులో ఎత్తుకున్నా .. అప్పటి నుంచి నువ్వు తేడాగా బిహేవ్ చేస్తున్నావ్ అని రాజ్ తిట్టుకుంటాడు. మీరు కారు ఆపితే ఇక్కడే దిగిపోతానంటూ స్టీరింగ్ పట్టుకుంటుంది .. కంగారులో రాజ్ సడెన్ బ్రేక్ వేస్తాడు.
ఎవడ్రా నువ్వు కారుకి మధ్యలో వచ్చి నిల్చున్నావ్ అంటూ రాజ్ అడుగుతాడు. పెళ్లి చూపులకు వెళుతుండగా నా కారు ఆగిపోయిందని.. లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు ఆ వ్యక్తి. సరేలే కానీ, పెళ్లి చేసుకొని ఎవడు బాగుపడలేదు .. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని రాజ్ సలహా ఇస్తాడు. దీనికి అతను నాకు తెలుసు బాసూ.. కానీ, పెళ్లి చేసుకుంటేనే నాకు ఆస్తి వస్తుంది. ఎందుకంటే మా తాత వీలునామా అలాగే రాసి చచ్చాడు అంటూ చెప్తాడు ఆ వ్యక్తి. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.