Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ మూవీ నుంచి డబుల్ ధమాకా.. ట్వీట్ వైరల్

by Hamsa |
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’ మూవీ నుంచి డబుల్ ధమాకా.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఈ ఏడాది ‘క’ సినిమాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. అదే ఫామ్‌తో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’(Dil Ruba). విశ్వ కరేణ్(Viswa Karen) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ మూవీని శివమ్ సెల్యులాయిడ్స్(Shivam Celluloids) అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది లవర్స్ డే(Lovers' Day) స్పెషల్‌గా ఫిబ్రవరిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా, ‘దిల్‌రూబా’ చిత్రం నుంచి మేకర్స్ డబుల్ అప్డేట్ ఇచ్చారు. ఇందులోంచి కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టీజర్ అప్డేట్‌ను షేర్ చేశారు. జనవరి 3న ‘దిల్‌రూబా’ టీజర్ విడుదల కానుందని తెలుపుతూ అగ్రెసీవ్ లుక్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ప్రేక్షకుల్లో హైప్ పెంచారు.

Advertisement

Next Story

Most Viewed