- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu:నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యూ ఇయర్ వేళ ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) గుడ్ న్యూస్ చెప్పారు. నూతన సంవత్సరం తొలి రోజు సీఎం చంద్రబాబు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల(CMRF Funds) విడుదలకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తు దారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేద వర్గాలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ధి కలిగింది. ఈ క్రమంలో నేడు(బుధవారం) సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం(AP Government) ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ.124.16 కోట్లకు చేరింది. దీంతో 9,123 మంది మొత్తం మీద ప్రయోజనం పొందనున్నారు.
Also Read..
‘గత విధ్వంస పాలనను ప్రజలు తరిమికొట్టారు’.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్