Mammootty: ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Hamsa |
Mammootty: ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) కాంబోలో ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’(Dominic and The Ladies Purse ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇందులో గోకుల్ సురేష్, లీనా, సిద్ధికి, విజయ్ బాబు, విజి వెంకటేష్(VG Venkatesh) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ఫేరర్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా, నూతన సంవత్సరం సందర్భంగా మమ్ముట్టి ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ జనవరి 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు‌ వెల్లడించారు.‌ అయితే రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే మమ్ముట్టి ఒక షట్టర్ ఓపెన్ చేసి కిందకు చూస్తున్నారు. ఆయన ముందు ఒక లేడీస్ పర్స్, ఓల్డ్ నోకియా ఫోన్, బైనాక్యులర్, సిమ్ కార్డు, పెన్ను, భూతద్దం ఉన్నాయి. షట్టర్ వెనుక పిల్లి కూడా కనబడుతుంది. షట్టర్ లోపల ఆ పిల్లి అడుగులు ఉన్నాయి.‌ హీరోకు, వాటికి సంబంధం ఏమిటి? అనేది తెలియాలి అంటే జనవరి 23 వరకు వెయిట్ చేయాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Advertisement

Next Story

Most Viewed