నాటు కోళ్లపై విషం ప్రయోగం..60 నాటు కోళ్లు మృత్యువాత..

by Aamani |   ( Updated:2025-01-01 10:41:23.0  )
నాటు కోళ్లపై విషం ప్రయోగం..60 నాటు కోళ్లు మృత్యువాత..
X

దిశ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో నూతన సంవత్సరం తొలి రోజు అపశృతి సంభవించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట్ మండలం గంగా సమందర్ లో మోతే చిన్న సాయన్న కు నాటు కోళ్లు కలవు. పిల్లలు,తల్లులు సుమారు దాదాపు కిలోన్నర రెండు కిలోల బరువున్న నాటు కోళ్లను గిట్టనివారు బియ్యం గింజలలో విషం కలిపి నాటు కోళ్లకు పెట్టినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో గిట్టని వారు చేసిన ఇలాంటి దుశ్చర్య దాదాపు 50 నుంచి 60 వరకు కోళ్లు, గొల్ల మల్లు కు చెందిన ఒక గొర్రె పిల్ల చనిపోయినట్లు బాధితుడు మోతే చిన్న సాయన్న ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా గుర్తు తెలియకుండా గిట్టని వారు నాటు కోళ్లకు విషం ఇచ్చి ఇలా చేయడం మొదటిసారి కాదని, ఇది మూడవ సారీ అని ఆవేదనతో పేర్కొన్నారు.ఈ విష ప్రయోగం చేసిన ఆ వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషం కలిపిన బియ్యం సంఘటనా స్థలంలో దొరికాయని, ఇది స్థానిక పోలీసులకు, పత్రిక విలేకరులకు, పశువుల సంబంధిత డాక్టర్ లకు అందజేసినట్లు బాధితుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆర్మూర్ నియోజకవర్గ ప్రధాన ప్రతినిధి మోతే చిన్న సాయన్న వివరించారు. స్థానిక పోలీసులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన గుర్తు తెలియని దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed