- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అది చంద్రబాబుకే సాధ్యం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijaywada) నగర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు, కనెక్టివిటీ పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పనుల బాధ్యతలను ఎంపీ కేశినేని చిన్ని(Mp Kesineni Chinni), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Mla Gadde Rama Mohan)కు అప్పగించింది. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే శనివారం విజయవాడ నగరంలో పర్యటించారు. విజయవాడకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు కొత్త ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ త్వరలో విజయవాడనగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని, అందుకు కావాల్సిన నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు విజయవాడను సుందరీకరణంగా తీర్చిదిద్దడంతో పాటు రోడ్లు, కనెక్టివిటీ పెంచడం సీఎం చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ముందుకు సాగుతామని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.
Also Read...
Ap News: పవన్ కల్యాణ్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్