‘దిశ’ అతి తక్కువ వ్యవధిలోనే ప్రజల మన్ననలు అందుకుంది : ముషీరాబాద్ ఎమ్మెల్యే

by Aamani |
‘దిశ’ అతి తక్కువ వ్యవధిలోనే ప్రజల మన్ననలు అందుకుంది : ముషీరాబాద్ ఎమ్మెల్యే
X

దిశ,రాంనగర్ : ముషీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దిశ పనిచేస్తుందని పనిచేస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అభిప్రాయపడ్డారు. బుధవారం ముషీరాబాద్, కవాడిగూడ ప్రాంతంలో దిశ దినపత్రిక - 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించి, పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వేగంగా వార్తలు అందించడమే ముఖ్యమని, డిజిటల్ మీడియాలో ఆ వేగాన్ని దిశ పత్రిక సమర్థవంతగా అందుకున్నదని తెలిపారు. ఎప్పటి వార్తలు అప్పుడే ప్రచురిస్తూ,కాలానికి అనుగుణంగా పరుగులు పెడుతున్న దిశ.. అతి తక్కువ వ్యవధిలోనే ప్రజల మన్ననలు అందుకున్నదని అన్నారు.

ప్రజలందరికీ కొత్త సంవత్సరంలో శుభం కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రిక అనుసంధానకర్తగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బింగి నవీన్, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మీడియా ఇంచార్జి మచ్చ కుర్తి ప్రభాకర్, శ్రీధర్ చారి,బల్ల ప్రశాంత్, కరికి కిరణ్ ,రాంనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం శేఖర్, స్థానిక దిశ పత్రిక రిపోర్టర్ ఖుర్షీద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story