‘OG’ కోసం నేనూ వెయిటింగ్.. స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-29 15:58:09.0  )
‘OG’ కోసం నేనూ వెయిటింగ్.. స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న 'OG' మూవీ పై అభిమానులకు రోజురోజుకు ఆత్రుత పెరిగిపోతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో ఓజీ మూవీ పై గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్(Ram Charan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘OG’ మూవీ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు. సంక్రాంతికి తన సినిమా లేకపోతే పవన్ బాబాయ్‌తో బలవంతగానైనా ‘ఓజీ’ని రిలీజ్ చేయించేవాడినని చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరు, OG పేరు వినగానే హాల్ అంతా అరుపులతో దద్దరిల్లిపోయింది.

అమెరికాలో కూడా జనసేనాని రేంజ్ మాములుగా లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మేరకు USలో ‘గేమ్ ఛేంజర్’(game changer) ప్రమోషన్లలో రామ్ చరణ్ మాట్లాడారు. ‘నేను సోలోగా మూవీ తీసి ఐదేళ్లు అవుతోంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో మీ ముందుకొస్తున్నా. ఈ సినిమాలో సాంగ్స్, ఫైట్స్ కాదు అన్నీ ఉన్నాయి’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

Read More...

Pawan Kalyan: గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు (వీడియో)


Next Story

Most Viewed