పాల వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి బాలిక మృతి

by Kalyani |
పాల వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో  చిన్నారి బాలిక మృతి
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని పడకల్ నుండి రావిచేడు వెళ్లే మార్గమధ్యంలో పడకల్ గ్రామానికి చెందిన జిల్లెల్ల శేఖర్ యాదవ్ అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఆదివారం ప్రియంసియాదవసీ అనే 11 నెలల చిన్నారి తల్లిదండ్రులతో ఆడుకుంటూ ఉండగా బాలికను గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యాన్ నడపడం తో పాప మృతి చెందిన సంఘటన చోటు చేసుకుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీబా జిల్లాలోని గమీర్బాగ్ అనే గ్రామానికి చెందిన పూజ-పుష్పరాజు అనే దంపతులు గత నాలుగు నెలల క్రితం పడకల్ గ్రామంలోని శేఖర్ యాదవ్ అనే రైతు వద్ద వ్యవసాయ పొలంలోని ఆవుల షెడ్డు వద్ద పాలు పితకడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

రోజు వారీగా ఆదివారం ఉదయం పాల వ్యానులో పాలు తీసుకెళ్లడానికి వచ్చిన సమయంలో 11 నెలల చిన్నారి తల్లిదండ్రుల వద్ద ఆడుకుంటూ ఉండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యాన్ నడపడంతో పాపకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పాపను కడ్తాల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ జినుకుంట్ల నరేష్ పై కేసు నమోదు చేసి చిన్నారి శవాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Next Story