- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu:‘2024 .. హిస్టారికల్ ఇయర్’.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 చాలా హిస్టారికల్ ఇయర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ భవన్లో చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. ఈ ఏడాది గత ఐదేళ్ల పాలనకు విముక్తి కలిగిందన్నారు. మీడియా కూడా ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు. ఆరు నెలలుగా అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందన్నారు. అధికారులు కూడా గత ఐదేళ్లలో బురద గుంతలో తోసేశారని ఆరోపించారు. కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని అన్నారు. తమ ప్రభుత్వంలో తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను పదేపదే హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు నా అభిప్రాయాలకు తేడా ఉంటుందన్నారు. సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలి లేదన్నారు. గతంలో రౌడీయిజం మతకలహాలు అణిచి వేసినట్లే ఇప్పుడు పని చేస్తానని తెలిపారు.
కొందరు కార్యకర్తలు తమ ఎజెండా నేను అమలు చేయాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్లా మేము తప్పులు చేస్తే ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారని అన్నారు. నాకు నా ప్రజలే హై కమాండ్ అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. n కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తెచ్చుకోగలుగుతున్నామన్నారు. జగన్ ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీ వైపు చూసేవారా అని ప్రశ్నించారు. జగన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు.. మేము ఒకటో తేదీనే ఇస్తున్నామన్నారు. కీలక పదవులు కూడా జగన్ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని కీలక పదవుల్లో బీసీలు ఉన్నారని తెలిపారు.
తాము అధికారంలోకి రాకముందు ప్రజలకు బాగా ఇబ్బంది కలిగిందని.. దీంతో జనం నచ్చిన విధంగా తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆరు నెలల్లో జనానికి ఒక హోప్ వచ్చిందన్నారు. తనకు నాలుగవ సారి సీఎం అయ్యాక కొత్త అనుభవం ఎదురైందన్నారు. ఎందుకంటే లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుందని తెలిపారు. అధికారులు అందరికీ చాలా వింత అనుభవాలు కలిగాయన్నారు. చాలామందిని లోతుగా ముంచేశారని విమర్శించారు. వ్యవస్థలను విధ్వంసం జరిగాయన్నారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అన్ని డ్రా చేశారన్నారు. ‘‘అమరావతికి చిక్కుముడులు వేశాడు జగన్.. నేను వాటిని విప్పదీసి ట్రాక్‌లో పెట్టాను. పోలవరాన్ని కూడా ట్రాక్‌లోకి తీసుకువచ్చాను. ఇపుడిప్పుడే ట్రాక్‌లో పెడుతున్నాను. అమరావతికి డబ్బులు తీసుకువచ్చాను. పోలవరంను కూడా త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన బీసీలకే అగ్ర తాంబూలం ఇస్తామని అన్నారు. జగన్ నైజం గ్రహించి ఆ పార్టీ నేతలు వైసీపీని వీడుతున్నారని పేర్కొన్నారు. నేతలు చేరిక విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. నేతల చేరికపై కూటమి పార్టీలు చర్చించి నిర్ణయిస్తాయని వెల్లడించారు. టిడిపి త్వరలోనే కోటి సభ్యత్వాలను నమోదు చేసుకుంటుందని అన్నారు. మంగళగిరి పాలకొల్లు కుప్పంలో సభ్యత్వం నమోదు వేగంగా ఉందని అభినందించారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని తెలిపారు. ప్రజల ఆలోచనలు అవసరాల మేరకు పాలన విధానాలు మార్చుకుంటున్నామని తెలిపారు. అధికారులు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు పనితీరు మార్చుకోవాలన్నారు. వివిధ అక్రమాల్లో జగన్ మాకు లడ్డూల దొరికారని చమత్కరించారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ పెంపు ఉండబోదన్నారు.
పదవి నుంచి దిగిపోతూ జగన్ విద్యుత్ చార్జీలు పెంచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందనటం దుర్మార్గం అన్నారు. విద్యుత్ రంగంలోనే రూ.1.29 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు బయటికి వస్తున్నాయని తెలిపారు. విద్యుత్ తో పాటు వివిధ రంగాల్లో జగన్ చేసిన పాపాలు అనేకం ఉన్నాయన్నారు. జగన్ చేసిన పాపాలన్నిటినీ ఒక్కొక్కటిగా సరి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సెకీ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. దెబ్బతిన్న రహదారుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. జగన్ పట్టించుకోని రోడ్లన్నిటినీ మేమే బాగు చేస్తున్నామని సీఎం తెలిపారు.
Also Read..
CM Chandrababu:నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం ఆ ఫైల్ పైనే!