Pakistan : నేడు ఐరాస భద్రతా మండలిలోకి పాక్

by Hajipasha |
Pakistan : నేడు ఐరాస భద్రతా మండలిలోకి పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితిలో అత్యంత కీలకమైన భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం(Non Permanent Member)గా పాకిస్తాన్‌(Pakistan)కు అవకాశం లభించింది. బుధవారం (జనవరి 1) నుంచి 2026 డిసెంబరు వరకు దాదాపు రెండేళ్ల పాటు భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాక్ వ్యవహరించనుంది. సెక్యూరిటీ కౌన్సిల్‌(UN Security Council)లో ఇప్పటివరకు జపాన్ ఉన్న స్థానంలో పాకిస్తాన్‌కు చోటు దక్కింది. భద్రతా మండలిలో కొత్తగా అవకాశాన్ని దక్కించుకున్న ఇతర దేశాల జాబితాలో డెన్మార్క్, గ్రీస్‌, పనామా, సోమాలియా కూడా ఉన్నాయి. ఈ వివరాలను ఐరాసలోని పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ వెల్లడించారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం తమ బృందం ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో తమ దేశం నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందన్నారు. అయితే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాకిస్తాన్‌కు తాత్కాలిక సభ్యదేశంగా చోటు దక్కడం ఇదే తొలిసారేం కాదు. గతంలో 2012-13, 2003-04, 1993-94, 1983-84, 1976-77, 1968-69, 1952-53 సంవత్సరాల్లోనూ భద్రతా మండలితో పనిచేసిన అనుభవం పాక్‌కు ఉంది. ఐరాస భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. వాటిలో 5 శాశ్వత సభ్యదేశాలు. అవి.. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌. మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్‌ పద్ధతిలో రెండేళ్లకోసారి మారుతుంటాయి.

Advertisement

Next Story

Most Viewed