- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR vs Kavitha: బీఆర్ఎస్ లో కవిత వర్సెస్ కేటీఆర్!.. న్యూ ఇయర్ తొలి రోజే పార్టీలో హాట్ టాపిక్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఫ్యూచర్ ఏంటనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్నది. ఈ క్రమంలో గులాబీ పార్టీలో పరిణామాలపై న్యూ ఇయర్ రోజే ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. పార్టీలో నంబర్ వన్, నంబర్ టూ అని టాక్ ఉన్న కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) విషయంలో ఓ వైపు కమిషన్ల విచారణలు మరో వైపు నోటీసులతో పార్టీలో అంతా గడబిడగా ఉంది. ఇంతలో సొంత పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ (Kavitha Vs KTR)మధ్య పొజిషన్ వార్ సాగుతున్నదా? అన్న చర్చ తెరపైకి రావడం సంచలనంగా మారుతున్నది. కాబోయే సీఎం.. అంటూ ఇటు కవిత అటు కేటీఆర్ అనుచరులు ఎవరికి వారు స్లోగన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతున్నది. అసలే అనేక కష్టాలతో సతమతం అవుతున్న కారు పార్టీలో గతంలో ఎన్నడూ లేని ఈ కొత్త సంస్కృతి ఇప్పుడు కేడర్‌ను మరింత గందరగోళానికి గురి చేస్తోందనే టాక్ గుప్పుమంటోంది.
కారులో ఆధిపత్య పోరు?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఏదో ఓ రూపంలో పార్టీలో కొత్త జోష్ నింపుతారనే ఆశలు కేడర్‌లో నెలకొంటున్న వేళ అనూహ్యంగా పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతోందా? అనే చర్చ కలకలం రేపుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఇటీవల నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఆ సందర్భంలో అక్కడ నాయకులు కవిత సీఎం.. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బెయిల్‌పై విడుదలై తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలోనూ ఎయిర్ పోర్టులో ఇవే స్లోగన్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే ఇవాళ తెలంగాణ భవన్లో 2025 క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కేటీఆర్ సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటి వరకు ఆ పార్టీలో సీఎం అభ్యర్థి అంటే కేసీఆర్ అనే భావన అందరిలో ఉండేది. కానీ ప్రస్తుతం సీఎం క్యాండిడేట్ విషయంలో ఇప్పుడు కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం అభ్యర్థి విషయంలో కవిత పేరు ఇటీవల తరచూ వినిపిస్తోంది. జైలుకు వెళ్లిన వారే సీఎం అయితే అందులో కేటీఆర్ కంటే ముందు వరుసలో కవిత ఉంటారని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సైతం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో (Telangana Bhavan) కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు చేయడం వెనుక పార్టీలో అధిపత్య పోరే కారణమా? అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.
హాట్ టాపిక్‌గా పార్టీలో కొత్త సంస్కృతి
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయాక ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్ (KCR Farm House) నుంచి బయటకు వచ్చి మౌనం వీడటం లేదు. ఈ క్రమంలో కేసీఆర్ మౌనం ప్రత్యర్థులకు ఆయుధంగా మారడమే కాదు బీఆర్ఎస్ కేడర్‌లో చీలిక తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికి అనే చర్చ ప్రస్తుతం ప్రధానాంశంగా మారింది. ఈ క్రమంలో కాబోయే సీఎం కవిత అంటూ అమె అనుచరులు, కాబోయే సీఎం కేటీఆర్.. అంటూ ఆయన మద్దతుదారులు స్లోగన్స్ ఇచ్చుకోవడం పార్టీలో చీలికను తెచ్చే ప్రమాదం ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి ప్రజాక్షేత్రంలోకి వస్తారా? లేక ఇటువంటి చర్చకు మరింత ఆస్కారం ఇస్తారా? అనేది వేచి చూడాలి.
Also Read..
ఇవన్నీ చూస్తుంటే భయమేస్తోంది.. ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు