- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Azerbaijan : రష్యా వల్లే మా విమానం కూలింది.. నేరాన్ని అంగీకరించాలి : అజర్‌బైజాన్ అధ్యక్షుడు
దిశ, నేషనల్ బ్యూరో : కజకిస్తాన్‌లోని అక్టౌ నగరంలో తమ దేశ ప్యాసింజర్ విమానం కూలిన ఘటన(plane crash) పై అజర్‌బైజాన్(Azerbaijan) అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) భూభాగం నుంచి జరిగిన మిస్సైల్ దాడిలోనే తమ దేశ విమానం కూలిందని ఆయన వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఈ దాడి జరిగి ఉండొచ్చన్నారు. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం దక్షిణ రష్యా నగరమైన గ్రోజ్నీ వైపు వెళ్తుండగా రష్యా మిస్సైల్ తాకిందని అలియేవ్ చెప్పారు. ‘‘తొలుత మా దేశ విమానం ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థ కిందకు వెళ్లింది. అనంతరం దాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా భూభాగం నుంచి మిస్సైల్‌ను ప్రయోగించారు. అది వచ్చి తాకగానే మా విమానం కూలిపోయింది’’ అని ఆయన వివరించారు.
విమానాన్ని కూల్చేసినందుకు రష్యా నేరాన్ని అంగీకరించాలని అలియేవ్ డిమాండ్ చేశారు. తమ దేశ విమానాన్ని కూల్చినందుకు బాధ్యులను శిక్షించాలని కోరారు. కజకిస్తాన్‌లోని అక్టౌ నగరంలో డిసెంబరు 25న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం (జే2-8243) కూలింది. ఆ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు చనిపోయారు. తమ దేశ భూభాగం నుంచే ఆ విమానంపై దాడి జరిగిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒప్పుకున్నారు. ఈ దాడి జరిగినందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. రష్యాలోని దక్షిణ భూభాగంపై దాడి చేస్తున్న ఉక్రెయిన్ డ్రోన్లను తిప్పికొట్టేందుకు మిస్సైళ్లను ప్రయోగించగా.. ఒక మిస్సైల్ వెళ్లి అజర్ బైజాన్ విమానాన్ని తాకిందన్నారు.