- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదకరంగా వంతెన…కూలిన సైడ్ పిల్లర్లు
by Kalyani |
X
దిశ, సంగారెడ్డి/రాయికోడ్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో వాగుపై నిర్మించిన బ్రిడ్జి (వంతెన ) ప్రమాదకరంగా మారింది. శనివారం కురిసిన భారీ వర్షానికి సైడ్ పిల్లర్లు కూలిపోయాయి. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిన వంతెన ఇరుపక్కల సైడ్ వాల్స్ కూలి నీటిలో పడ్డాయి. దీంతో ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. సైడ్ వాల్సే కాకుండా వంతెన నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తుంది. దీంతో బ్రిడ్జి కూడా కూలుతుందేమోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెనపై నిత్యం వాహనదారులతో పాటు మూగజీవాలు సైతం వెళుతుంటాయి. రాత్రి వేళలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, వాహనదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story