Tirumala: తిరుమలపై ఫెంగల్ ఎఫెక్ట్.. పాప వినాశనం, శ్రీవారిపాదాలు మూసివేత

by Rani Yarlagadda |   ( Updated:2024-11-30 07:19:32.0  )
Tirumala: తిరుమలపై ఫెంగల్ ఎఫెక్ట్.. పాప వినాశనం, శ్రీవారిపాదాలు మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుపాన్ (Fengal Cyclone) ప్రభావంతో తిరుమల (Tirumala)లో వర్షం కురుస్తుండటంతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు పొగమంచు దట్టంగా కమ్మేయడంతో.. చలితీవ్రత పెరిగింది. వారాంతం కావడంతో.. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. కానీ.. వాతావరణం మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. ఘాట్ రోడ్డులో వచ్చే వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తమైంది. భారీ వృక్షాలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ (TTD) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాపవినాశనం (PapaVinasanam), శ్రీవారి పాదాలు (Srivari Padalu) మార్గాలను మూసివేసింది. వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం తగ్గిన తర్వాతే వాటిని తెరవనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్థానికులకు దర్శన టికెట్లు

తిరుమలలో శ్రీవారి దర్శనానికి స్థానికులకు అవకాశం కల్పిస్తోంది టీటీడీ. తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో ఉండే భక్తులకు దర్శనం టోకెన్లను అందించనుంది. రేణిగుంట, చంద్రగిరి మండలాల్లో డిసంబర్ 1న స్థానికులకు టోకెన్లు జారీ చేయనుంది. బాలాజీనగర్ (Balaji Nagar) కమ్యూనిటీ హాల్ వద్ద ఈ మేరకు కౌంటర్ ను ఏర్పాటు చేయనుంది టీటీడీ. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. దర్శనం టోకెన్లు పొందాలని టీటీడీ తెలిపింది.

Read More : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

Advertisement

Next Story

Most Viewed