మదన్మోహన్‌కు కేబినెట్‌లో బెర్త్ పక్కా..? ఏ శాఖ ఇస్తారని చర్చ

by Shiva |   ( Updated:2024-11-30 07:11:16.0  )
మదన్మోహన్‌కు కేబినెట్‌లో బెర్త్ పక్కా..? ఏ శాఖ ఇస్తారని చర్చ
X

దిశ, ఎల్లారెడ్డి: కేబినెట్ విస్తరణలో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌కు బెర్త్ ఖాయమైనట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఉమ్మడి జిల్లాలో కష్టపడిన నాయకుడు ఎమ్మెల్యే మదన్మోహన్ మంత్రి పదవి రేసులో ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఆయన కీలకంగా పని చేశారు. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉండటంతో వారి మధ్య పోటీ నువ్వా.. నేనా అన్న చందంగా మారింది. కానీ, మదన్మోహన్‌కు కేబినెట్‌లో బెర్త్ ఖరారు అయిందనే విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకులు అయినప్పటికీ, మంత్రి పదవి విషయంలో మొదటిసారి గెలిచిన మదన్మోహన్ వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయనకు మంత్రి దక్కితే ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ఢిల్లీలో లాబీయింగ్ మొదలు పెట్టారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఢిల్లీకి వెళ్లి కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోని బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రిగా పని చేసి ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అని వైస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలోనే తొలిసారిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కబోతోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు మదన్మోహన్ వైపు మొగ్గు చూపుతారా.. లేక మరోసారి పెద్ది సుదర్శన్‌ రెడ్డి వైపే మొగ్గు చూపుతారా అనే విషయం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story