- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaran OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘అమరన్’
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’(Amaran). రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్(Kamal Haasan), r. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్‌నేషన్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్స్(God Bless Entertainments)తో కలిసి నిర్మించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్(Major Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో ‘అమరన్’(Amaran) చేరింది. అయితే ఈ సినిమా రియల్ స్టోరీ అని తెలుసుకున్న వారంతా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ‘అమరన్’(Amaran) డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్(Streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా శివ కార్తికేయన్ రక్తంతో తడిసి కోపంతో చూస్తున్న పోస్టర్(Poster)ను షేర్ చేశారు. దీంతో అది చూసిన సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.