- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: తిరుమల లడ్డూ వివాదం.. గవర్నర్ నజీర్‌ను కలిసిన వైస్ షర్మిల
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో ఆలయాలు అపవిత్రం అయ్యాయని, ఆగమ శాస్త్రాలు, సాంప్రదాయలను ఆ పార్టీ మంటగలిపిందని మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు పలువురు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ(CBI)తో విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (AP PCC chief YS Sharmila), గవర్నర్ జస్టిస్ ఎస్ నజీర్ (Governor Justice S Nazir)ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీవారి ప్రసాదం భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న విషయమని అన్నారు. అన్ని మతాలను గౌరవించాల్సి అవసరం అందరిపై ఉందని తెలిపారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్ (NDDB Report) ప్రకారం.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పక్కాగా కల్తీ జరిగిందనే విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు. భక్తులకు పంపిణీ చేసే లడ్డూలో వాడే నెయ్యి రూ.320కే కొనడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా స్వామి వారి నిత్య నైవేద్యానికి రూ.1,600 పెట్టి కొంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ(YCP Government) హయాంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆమె ఆరోపించారు. జూలై 23న ల్యాబ్ రిపోర్ట్ (Lab Report) వస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.