విపక్షాల తీరుపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం

by Satheesh |   ( Updated:2024-07-02 11:11:05.0  )
విపక్షాల తీరుపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా  తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్ సభ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడుతుండగా.. ఆయన స్పీచ్‌కు విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్ అల్లర్ల ఇష్యూ, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోడీ మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతుండగా.. విపక్షాలు అడ్డుతగలడంతో మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా వారికి పరాజయం తప్పలేదని.. ఆ అక్కస్సుతోనే ఇలా చేస్తున్నారని మోడీ ఫైర్ అయ్యారు. ప్రధాని ప్రసంగానికి అడ్డుతగలడంతో విపక్షాలపై స్పీకర్ మండిపడ్డారు. సభ్యులను వెల్‌లోకి పంపడం మంచి పద్దతి కాదని విపక్షాలకు హితవు పలికారు. ప్రధాని ప్రసంగానికి అడ్డుతగలడం సబబు కాదని.. సభను పక్కదోవ పట్టించొద్దని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు. స్పీకర్ వార్నింగ్‌తో విపక్షాల కాస్త కూల్ కాగా.. ప్రధాని మోడీ ఆయన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed