ప్రశాంత్ కిషోర్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

by Mahesh |   ( Updated:2025-01-06 02:06:32.0  )
ప్రశాంత్ కిషోర్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్రంలో జన్ సూరాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌(Prashanth Kishore) బీపీఎస్సీ(BPSC) అభ్యర్థులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేగంగా గాంధీ మైదాన్‌(Gandhi Maidan)లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడం, రాహుల్ గాంధీ మద్దతు కోరడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్‌ దీక్షను పోలీసులు సోమవారం తెల్లవారుజామున బగ్నం చేసిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore)ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష పేపర్ లీకేజీ జరిగిందని అభ్యర్థులు గత నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా జనవరి 2న నిరసన ప్రారంభించారు. అదుపులోకి తీసుకునే ముందు, బీపీఎస్సీ అక్రమాలపై జనవరి 7న పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని జన్ సూరజ్ చీఫ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed