PM Modi : యూరోపియన్ కమిషన్ చీఫ్‌గా ఉర్సులా.. ప్రధాని మోడీ అభినందనలు

by Hajipasha |
PM Modi : యూరోపియన్ కమిషన్ చీఫ్‌గా ఉర్సులా.. ప్రధాని మోడీ అభినందనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : యూరోపియన్ యూనియన్‌కు చెందిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా జర్మనీ రాజకీయ నాయకురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆమెకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రపంచ ప్రయోజనాల కోసం భారతదేశం-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విషయంలో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని మోడీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధానిమోడీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈవివరాలను భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed