Maharashtra CM : సీఎం షిండే‌పై బీజేపీ నేత ఫైర్.. ద్రోహి అంటూ..

by Hajipasha |
Maharashtra CM : సీఎం షిండే‌పై బీజేపీ నేత ఫైర్.. ద్రోహి అంటూ..
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర సీఎం(Maharashtra CM) ఏక్‌నాథ్ షిండే నాయకత్వంపై బీజేపీలో అసంతృప్తి రగులుతోంది. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలోనే షిండే ఉన్నప్పటికీ.. విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు. ఏక్‌నాథ్ షిండేపై ఉల్హాస్‌నగర్ జిల్లా బీజేపీ(BJP) అధ్యక్షుడు ప్రదీప్ రాంచందానీ(Pradeep Ramchandani) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్రోహులుగా పేరొందిన వాళ్లు ఏకంగా సీఎంలు అయిపోతున్నారు’’ అంటూ పరోక్షంగా షిండేపై ఆయన నిప్పులు చెరిగారు. రాజకీయాల నిర్వచనం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కామెంట్స్‌పై ఉల్హాస్‌నగర్ జిల్లా శివసేన (షిండే) నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంటనే ప్రదీప్ రాంచందానీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే ఉల్హాస్‌నగర్ పరిధిలోని బీజేపీ అభ్యర్థి కుమార్ ఐలానీ తరఫున ఎన్నికల ప్రచారం చేయబోమని శివ సైనికులు తేల్చి చెప్పారు. దీంతో స్పందించిన రాంచందానీ క్షమాపణలు చెప్పారు. ‘‘నా వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించి చూపించారు. నేను ఉద్ధవ్ శివసేన నేతలను విమర్శించాను. సీఎం షిండేను విమర్శించలేదు’’ అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

నేను మహాయుతి అభ్యర్థిని.. బీజేపీ, శివసేన వ్యతిరేకిస్తున్నాయి : నవాబ్ మాలిక్

మన్‌ఖుర్ద్ శివాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ అభ్యర్థి నవాబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మహాయుతి కూటమి అభ్యర్థే అయినప్పటికీ.. ఆ కూటమిలోని బీజేపీ, శివసేన (షిండే) తనను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. దావూద్ ఇబ్రహీం, అండర్ వరల్డ్‌‌లతో లంకె పెట్టి.. తన అభ్యర్థిత్వాన్ని ఆ రెండు పార్టీలు వ్యతిరేకిస్తుండటాన్ని నవాబ్ మాలిక్ తప్పుపట్టారు. ‘‘నేను 50 ఏళ్లుగా పాలిటిక్స్ చేస్తున్నాను. నాకు కూడా అన్నీ తెలుసు. టెర్రరిస్టులతో లింకు పెట్టి దుష్ప్రచారం చేస్తే సహించను’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed