- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Obama: బైడెన్ ను కొనియాడిన ఒబామా
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వెదొలగడం పట్ల సొంతపార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. బైడెన్ ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Obama) కూడా కొనియాడారు. దేశంపై బైడెన్ కు (Biden) ఉన్న ప్రేమ ఈ నిర్ణయంతో తెలుస్తోందన్నారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ప్రపంచ వేదికపై అమెరికా గొప్పదనాన్ని బైడెన్ చాటిచెప్పారని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు.
కమలాకు మద్దతు తెలపని ఒబామా
మరోవైపు, రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని ఒబామా హెచ్చరించారు. డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు సరైన ప్రక్రియతో ముందుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపోతే, కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు ప్రకటించలేదు. సరైన ప్రక్రియతోమ ముందుకు రావాలని అన్నారు. మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం.