- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో టాప్ యూనివర్సిటీలు ఇవే.. NIRF 2023 ర్యాంకింగ్స్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: విద్య, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2023ని ఈరోజు, జూన్ 5, 2023న వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సీటీలను అధ్యయనం చేసి వాటి పనితీరు ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి గాను వివిధ యూనివర్సిటీలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది.
విద్యా మంత్రిత్వ శాఖ (MoE) నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్స్ 2023కి కొత్త కేటగిరీని తెచ్చింది. ప్రస్తుతం ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలు, మొత్తం ర్యాంకింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడికల్, లా, ఆర్కిటెక్చర్, దంత వైద్య కళాశాలలు, కొత్త విభాగం "వ్యవసాయం, అనుబంధ రంగాలు" కలిపింది. అదనంగా, ఆర్కిటెక్చర్ డిసిప్లిన్ కేటగిరీ జాబితాలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిసిప్లిన్‌గా పేరు మార్చబడింది.
NIRF ర్యాంకింగ్ 2023: టాప్ 5 విశ్వవిద్యాలయాలు ఇవే..
విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు భారతదేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం.
ర్యాంక్ 1: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
ర్యాంక్ 2: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ
ర్యాంక్ 3: జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ
ర్యాంక్ 4: జాదవ్‌పూర్ యూనివర్సిటీ కోల్‌కతా
ర్యాంక్ 5: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, భారతదేశం.